వైసీపీ ఎన్నికల ప్రచారంలో అనుకోని ఘటన ఎదురైంది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్. షర్మిల గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చేతి ఉంగరాన్ని గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటన ఆదివారం తాడికొండ ఎన్నికల ప్రచారంలో జరిగింది. ప్రజలు ప్రచార సభలకు హజరయ్యేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.