ఆయన వల్లే అవగాహన ఏర్పడి : శృతిహాసన్

0
47

ప్రేమలో పడి తన సినీ కెరీర్‌ను పాడు చేసుకున్నట్టు కోలీవుడ్ భామ శృతిహాసన్ వాపోతోంది. ఇటు తెలుగు, తమిళంతో పాటు.. అటు బాలీవుడ్ చిత్రాల్లో వరుసగా నటిస్తూ మంచి పీక్‌మీదున్న శృతిహాసన్… నటన పరంగా.. గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది.

ఫలితంగా టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో అగ్రస్థానానికి చేరుకుంది. ఆ తర్వాత ప్రేమలోపడి కెరియర్‌ను పాడుచేసుకుంది. ఈ కారణంగానే అభిమానులకు.. ఆమెకి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఇపుడు ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో మళ్లీ స్లిమ్‌గా మారి సినీ పరిశ్రమపై దృష్టిపెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇపుడు మళ్లీ సినిమాలపై దృష్టి పెడుతోన్న ఆమె, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజకీయాల గురించి ప్రస్తావించింది. ‘మా నాన్నకి సమాజంపై అవగాహన ఎక్కువ. సమాజంలోని సమస్యలు.. పరిస్థితుల గురించి ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిపై స్పందిస్తూ వుంటారు. ఆయన సినిమాల్లోనూ సామాజిక సందేశం కనిపిస్తుంది.

ప్రజలకు ఏం కావాలి? వాటిని ఎలా సాధించాలనే విషయంలో ఆయనకు స్పష్టమైన ఆలోచన వుంది. అలాంటి నాన్న రాజకీయాల్లోకి రావలసిన అవసరం ఎంతైనా వుంది. ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టేంతవరకూ నాకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు అవగాహన పెంచుకుని ఆయనకు సహకరించాలని అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది.