ఏపీలో తెల్ల రేషన్ కార్డులున్న వారికి శుభవార్త

0
73
Wight Ration card
Wight Ration card

ఏపీలో తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఏడాదికి రూ.5 లక్షల విలువైన వైద్య సేవలు అమల్లోకి వస్తాయని ఏపీ సర్కారు వెల్లడించింది. దీంతో వైద్య సేవల ఖర్చు రెండింతలు అయ్యింది. ఈ విధానం సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. ఫలితంగా రాష్ట్రంలోని 1.47 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఏపీ సర్కారు వెల్లడించింది.

ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఏడాదికి రెండున్నర లక్షల రూపాయల విలువైన వైద్యసేవలు అందుతుండగా, ఇటీవల దీనిని రూ. 5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మొదట్లో తెల్లరేషన్ కార్డుదారులకు రూ.2 లక్షల విలువైన వైద్య సేవలు అందుబాటులో ఉండగా, 2015లో దీనిని రూ.2.50 లక్షలకు పెంచారు. ఇప్పుడు ఏకంగా రెట్టింపు అయింది. దీంతో కేన్సర్, గుండె జబ్బులతోపాటు ఖరీదైన జబ్బుల బారిన పడినవారికి వైద్య ఖర్చుల రూపేణా ఉపశమనం లభిస్తుందని ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టు ఇన్‌చార్జి సీఈఓ డాక్టర్‌ సుబ్బారావు తెలిపారు.