చంద్రబాబు బాహుబలి.. మోదీ భల్లాలదేవుడు.. నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

0
65
Nara Lokesh
Nara Lokesh

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఏపీ మంత్రి నారా లోకేష్ కాలకేయుడితో పోల్చారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భల్లాల దేవుడు అంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఆంధ్రులను తలెత్తుకునేలా చేస్తున్న చంద్రబాబు బాహుబలి అని నారా లోకేష్ కొనియాడారు.

గుజరాత్‌లో నరమేధం చేసిన మోదీ భల్లాల దేవుడికి సరిసాటి అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా దాడి చేస్తున్న కాలకేయుడు మోదీ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. కేంద్రం నుంచి ఏమాత్రం సాయం లేకున్నా ఆంధ్రులను తలెత్తుకునేలా చేస్తున్న బాహుబలి చంద్రబాబని లోకేశ్ అభివర్ణించారు.

ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ చూసుకోవడానికి చంద్రబాబు, హెరిటేజ్ సంస్థను చూసుకోవడానికి బ్రహ్మణి, భువనేశ్వరి ఉన్నారని లోకేశ్ వివరించారు. రూ.54 వేల కోట్లు అవసరమైన పోలవరం ప్రాజెక్టు కోసం కేవలం రూ.6 వేల కోట్లు ఇచ్చి సరిపోవడం లేదంటే ఎలా? అని ప్రశ్నిస్తూ లోకేశ్ ఘాటుగా ట్వీట్ చేశారు.