పాయల్ అందాలకు వెంకీ మామ ఫిదా

0
29

హీరో విక్టరీ వెంకటేష్ – అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం వెంకీమామ. ఎఫ్2 వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత వెంకటేష్ నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా. ఈ చిత్రానికి ‘జై లవకుశ’తో హిట్ కొట్టిన బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇటీవలే రాజమండ్రిలో ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకుంది. అయితే, వెంకీ పెద్ద కుమార్తె అశ్రిత వివాహం కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడింది. ఇపుడు వివాహంతో పాటు.. రిసెప్షన్ పూర్తికావడంతో రెండో షెడ్యూల్ షూటింగుకి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నెల 8వ తేదీ నుంచి షూటింగుకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూలై నెల చివరివరకూ నాన్ స్టాప్‌గా షూటింగు కొనసాగేలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి హాస్యభరితంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుంటే, చైతూ జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది.

తన తొలి చిత్రం ఆర్ఎక్స్ 100 చిత్రంలోనే పాయల్ తన అందాలను పూర్తిగా ఆరబోసింది. ఇక ఇపుడు వెంకీ సరసన నటిస్తుండటంతో మరింతగా రెచ్చిపోవాలని భావిస్తోంది. దీంతో పాయల్ అందాలను జుర్రుకోవాలన్న ఆత్రుతతో వెంకీమామ ఉన్నారు. కాగా, ఈ చిత్రం దసరాకు రిలీజ్ కానుంది.