స్విగ్గీ డెలివరీ బాయ్‌ ఓవరాక్షన్.. నష్టపరిహారంగా రూ.200 కూపన్‌

0
48
Swiggy
Swiggy

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే చాలు, కొద్ది వ్యవధిలోనే ఆహారం అందించే సంస్థగా స్విగ్గీ గుర్తింపు సంపాదించుకుంది. అయితే, డెలివరీ బాయ్ ఫుడ్ అందించేందుకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఫిర్యాదు చేస్తే, అందుకు పరిహారంగా రూ.200 విలువ చేసే ఫుడ్ కూపన్ పంపి అభాసుపాలైంది స్విగ్గీ.

వివరాల్లోకి వెళితే.. ఓ యువతి గతవారం తనకెంతో ఇష్టమైన ఫుడ్‌ను స్విగ్గీలో ఆర్డర్ చేసింది. ఆ ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన బాయ్, తన పనేదో తాను చూసుకోకుండా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దాంతో భయపడిపోయిన ఆ యువతి ఫుడ్ పార్సిల్‌ను లాగేసుకుని ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అనంతరం, స్విగ్గీ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయగా, వాళ్లు ఆమెకు క్షమాపణలు తెలపడంతో పాటు రూ.200 విలువైన ఫుడ్ కూపన్‌ను పంపారు.

ఆ డెలివరీ బాయ్ ప్రవర్తన బాధ కలిగించిందని భావిస్తే, స్విగ్గీ వ్యవహరించిన తీరు మరింత దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు జరిగిన ఈ అవమానాన్ని ఆమె ఫేస్‌బుక్‌లో పెట్టడంతో స్విగ్గీ ప్రతినిధులు క్షమాపణలు చెప్పడమే కాదు, ఆ డెలివరీ బాయ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.