‘జిగేల్ రాణి’కి దశ తిరిగింది… క్రేజీ హీరోయిన్‌గా పూజా హెగ్డే

0
129

వెండితెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన అందాల భామ పూజా హెగ్డే. ఈమె ఇపుడు క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ చిత్రంలో తన స్టార్‌డమ్‌ను పక్కనబెట్టి ఐటమ్ సాంగ్‌లో నటించింది. ‘జిగేల్ రాణి’ పాటలో తన అందాలను ఆరబోస్తూ నర్తించింది. ఈ ఒక్క పాట ఆమె కెరీర్‌నే మలుపుతిప్పిందని చెప్పొచ్చు. ఫలితంగా ఈ భామ దశ తిరిగిపోయింది. ఇపుడు తెలుగు, బాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో వరుస ఆఫర్లూ వస్తున్నాయి. ఫలితంగా క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.

నిజానికి పూజా హెగ్డే నటించిన హిందీ చిత్రం ‘మొహంజొదారో’. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఆమెకి నిరాశనే మిగిల్చింది. ఈ సినిమా పరాజయంపాలు కావడం వలన, ఆమెకి అక్కడ అవకాశాలు రాలేదు. దాంతో ఆమె మళ్లీ టాలీవుడ్‌కి తిరిగొచ్చేసి, ‘దువ్వాడ జగన్నాథం’తో గ్లామరస్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది.

దాంతో ఆమెకి ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్ సరసన వరుసగా అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్లో చూపుతోన్న జోరు కారణంగా ఆమెకి బాలీవుడ్ నుంచి ‘హౌస్ ఫుల్ 4’లో అవకాశం వచ్చింది. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తోన్న సాజిద్ నడియాడ్ వాలాకి పూజా నటన విపరీతంగా నచ్చిందట. దాంతో తన బ్యానర్లో మరో రెండు సినిమాల్లో చేసేలా ఆమెతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం.