ఇడ్లీ పుట్టినిల్లు ఇండోనేషియానా?

0
39
Idly
Idly

అల్పాహారంగా ఎక్కడికెళ్లినా సులభంగా దొరికేది ఇడ్లీ. అయితే ఈ ఇడ్లీ మనదేశంలోనే పుట్టిందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇడ్లీ అసలు సంగతి ఏంటో తెలిస్తే.. షాక్ అవుతారు. ఇడ్లీ ఇండియాలో పుట్టలేదట. ఇండోనేషియాలో పుట్టిందని కేటీఆ ఆచార్య అనే ఫుడ్ హిస్టరియన్ చెప్తున్నారు. ఇడ్లీ అంటే సాధారణంగా దక్షిణాది వంటకం అనుకుంటాం. కానీ.. కేటీ ఆచార్య మాత్రం ఇడ్లీ పుట్టినిల్లు ఇండోనేషియా అంటున్నారు.

ఒకప్పుడు ఇండోనేషియాను పాలించిన హిందూ రాజులు ఉడికించే వంటకాలను కనుగొన్నారట. ఇందులో భాగంగానే ఇడ్లీలు తయారు చేయడం మొదలుపెట్టారట. ఈ క్రమంలో 800 – 1200 సంవత్సరంలో ఇడ్లీ ఇండియాలో అడుగుపెట్టిందట. ఇండియాలో తొలిసారిగా కర్నాటకలో ఇడ్లీలను తయారు చేశారని తెలిసింది.

కైరోలోని అల్-అజహర్ యూనివర్శిటీ లైబ్రరీలో ఉన్న వివరాల ప్రకారం.. దక్షిణ భూభాగంలో నివసించిన అరబ్ వ్యాపారులు ఇడ్లీని ఇండియాకు పరిచయం చేశారని.. దక్షిణాది ప్రజలను వివాహం చేసుకుని సెటిల్ అవ్వటంతో ఇడ్లీ దక్షిణాది వంటకంగా పేరొందినట్లుగా ఉంది.

ముస్లిం వంటకాలైన హలామ్‌లో కొంచెం ప్రత్యేకంగా కనిపించేందుకు రైస్ బాల్స్ ను క్రమేణా వాటిని గుండ్రంగా సన్నగా ప్రస్తుతం ఉన్న ఇడ్లీల రూపంలోకి మలిచి కొబ్బరి చెట్నీతో తినడాన్ని అలవాటు చేసుకున్నారట. అలా అలా 8వ శతాబ్దం నుంచి ఆ రైస్ బాల్స్.. ఇడ్లీ పేరుతో ప్రచారంలోకి వచ్చి దేశమంతా వ్యాపించాయని చరిత్రకారులు అంటున్నారు.

ఏది ఏమైనా ఇడ్లీ ఎక్కడ ఎలా పుట్టినా..ఇడ్లీ ఇండియాదేనని బలంగా నమ్ముతున్నారు భారతీయులు. అంతేకాదు ఇడ్లీకి ఇండియన్ ఫుడ్‌గా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. మార్చి30 ప్రపంచ ఇడ్లీ డే సందర్భంగా ఇడ్లీని ఇలా జనాలు గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా సోషల్ మీడియాలో ఇడ్లీ గురించి ఆసక్తి కరమైన చర్చ సాగుతోంది. ప్రపంచ ఇడ్లీ డే గడిచి రెండు రోజులైనా.. ఇడ్లీపై నెట్టింట చర్చ మాత్రం ఇంకా ఆగలేదు.