ఎన్టీఆర్‌ అసలైన వారసుడు.. నారా లోకేష్ కానే కాదు.. వర్మ

0
56
Ram Gopal Varma
Ram Gopal Varma

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఎన్నికల వేళ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసి హిట్ కొట్టిన వర్మ.. ప్రస్తుతం టీడీపీ భవితవ్యంపై కామెంట్లు చేశాడు. అసలైన ఎన్టీఆర్ అభిమానులకు ఇదే నా విజ్ఞప్తి అంటూ మొదలెట్టాడు. ఏపీ మంత్రి
నారా లోకేశ్ టీడీపీకి అసలైన వారసుడు కాదంటూ రాంగోపాల్ వర్మ మరో సంచలన ట్వీట్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్‌తోనే టీడీపీకి భవిష్యత్తు అంటూ మరోమారు వేడి రాజేశారు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఓ విజ్ఞప్తి అంటూ ట్వీట్ చేసిన వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్రను చూసిన తర్వాతే నిజాయతీపరులైన, అసలైన ఎన్టీఆర్ అభిమానులంతా ఓటు వేయాలని కోరారు.