మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అన్నందుకే… గల్లా జయదేవ్

0
47

నిండు పార్లమెంట్ సభలో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అన్నందుకే తన సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌తో దాడులు చేయించి భయపెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూశారని టీడీపీ ఎంపీ, గుంటూరు లోక్‌సభ అభ్యర్థి గల్లా జయదేవ్ అన్నారు.

అయితే, తాను భయపడకపోవడంతో హైదరాబాదులో ఉన్న మహేశ్ బాబు ఆస్తులపై దాడులు చేశారని మండిపడ్డారు. ఇలాంటి దాడులకు తానే కాదు, తన కుటుంబసభ్యులు కూడా భయపడరని చెప్పారు.

ఎన్నికలకు ఎంతో సమయం లేదని… ఈ వారం రోజులు ఎంతో కీలకమైనవని గల్లా జయదేవ్ టీడీపీ కార్యకర్తలకు గుర్తు చేశారు. ఇతర పార్టీల ప్రలోభాలకు ఓటర్లు లొంగవద్దని విన్నవించారు. రూ.16 వేల లోటు బడ్జెట్‌తో రాష్ట్రం విడిపోతే… రేయింబవళ్లు కష్టపడి రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలోకి తెచ్చారని అన్నారు.