ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాకే బాబు యూ టర్న్ : అరుణ్ జైట్లీ

0
46

విభజన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాలేదనీ, అందుకే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. దీన్ని అంగీకరించడమే కాకుండా అభినందిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ కూడా రాశారని ఆయన గుర్తుచేశారు.

ప్యాకేజీ పొందిన అనంతరం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ఆమోదించిన ప్రకారం నిధులొస్తాయని జైట్లీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడంపై జైట్లీ మాట్లాడుతూ, హోదా కింద ఇచ్చే డబ్బును కాంగ్రెస్ ఎక్కడి నుంచి తీసుకు వస్తుందన్నారు.

ఇప్పటికే తమ తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కావాలంటూ ఒడిశాతోపాటు అనేక రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని జైట్లీ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల కోసమే ఇలాంటి తప్పుడు వాగ్ధానాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.