యేడాది జైలు శిక్షపై మోహన్ బాబు వివరణ..

0
43
MohanBabu
MohanBabu

చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ నిర్మాత వైవీఎస్ చౌదరి పెట్టిన కేసులో ప్రముఖ నటుడు నిర్మాత మంచు మోహన్ బాబుకు హైదరాబాద్ ఎర్రమంజిల్ 23 మెట్రోపాలిటిన్ స్పెషల్ మెజిస్టేట్ కోర్ట్ ఒక యేడాది జైలుశిక్ష విధించింది. మోహన్ బాబు ఇచ్చిన మొత్తం 48 లక్షల రూపాయల చెక్కు బౌన్స్ కావడంతో నిర్మాత కోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన కోర్టు రూ.41.75 లక్షల అపరాధంతో పాటు.. ఒకయేడాది జైలుశిక్ష విధించింది.

దీనిపై మోహన్ బాబు స్పందించారు. 2009లో సలీమ్ సినిమా టైంలో డైరక్టర్ వైవిఎస్ చౌదరికి సినిమాకు సంబంధించిన మొత్తం చెల్లించాం. అయితే మా బ్యానర్‌లో మరో సినిమా చేయడానికి రూ.40 లక్షల చెక్ ఇచ్చాం. సలీమ్ అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో చౌదరితో మరో సినిమా వద్దని అనుకున్నాం. అయితే ఆ చెక్ బ్యాంక్‌లో వెయ్యవద్దని చెప్పాం. కానీ దాన్ని బ్యాంక్‌లో వేసి నాపై చెక్ బౌన్స్ కేసు వేశారు. ఇది కోర్టుని తప్పు దోవ పట్టించడమేనని అన్నారు.

అందుకే వారికి అనుకూలంగా తీర్పు వచ్చిందని.. అయితే ఈ కేసు విషయమై తాము సెషన్స్ కోర్టులో వేస్తామని సవాల్ చేస్తామని ఆయన తెలిపారు. కొన్ని ఛానెల్స్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాటిని అసలేమాత్రం నమ్మొద్దని ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.