హైదరాబాద్‌లో యాప్‌‌ల హైటెక్ వ్యభిచారం.. ఐదుగురు అరెస్ట్

0
85
vyabicharam
vyabicharam

హైదరాబాద్‌లో యాప్‌‌ల హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు అయ్యింది. అమీర్‌పేటలోని ఆదిత్యా పార్క్ ఇన్ హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఇన్‌స్పెక్టర్ బృందం ఆకస్మికంగా దాడిచేశారు. హోటల్ గదిలో పశ్చిమబెంగాల్, మహారాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువతులతోపాటు హోటల్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

వారికి అందిన సమాచారం మేరకు పంజాగుట్టలోని పోలో లాడ్జింగ్‌పై దాడి చేసారు, హోటల్ గదుల్లో ఉజ్బెకిస్తాన్ దేశానికి చెందిన ఐదుగురు యువతులతోపాటు నలుగురు విటులను కూడా అరెస్ట్ చేసారు. లొక్యాన్టో యాప్, హైదరాబాద్ ఎస్కార్ట్స్ అనే పలు ఇంటర్నెట్ యాప్‌ల ద్వారా విటులను ఆకర్షించి గుట్టుచప్పుడు కాకుండా అమీర్‌పేట, పంజాగుట్టలలోని ఖరీదైన హోటళ్లలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఈ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.