ఉగాది రోజున దీపారాధనకు నెయ్యినే వాడితే…?

0
71

ఉగాది రోజున అభ్యంగన స్నానం చేయడం అతిముఖ్యమైన విధి. ఉగాది నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులూ దేవిని ఆరాధిస్తారు. అభ్యంగన స్నానం తర్వాత నూతన వస్త్రధారణ, భగవత్పూజ పంచాగ శ్రవణం, ఉగాది పచ్చడి భక్షణం మంచిది.

అలాగే ఉగాది రోజున అభ్యంగన స్నానానికి అనంతరం పూజామందిరాన్ని పూజకు సిద్దం చేసుకోవాలి. నచ్చిన దేవతను పూజించవచ్చు. పూజకు ఉగాది పచ్చడి నైవేద్యం, పసుపు రంగులు పుష్పాలు వాడాలి. దీపారాధనకు ఆవునెయ్యి వాడాలి. ఇంకా ఉగాది నాడు శ్రీరాముడిని స్మరిస్తే శుభఫలితాలుంటాయి. అందుచేత శ్రీరామ మంత్రాన్ని 108 సార్లు పూజ చేసేటప్పుడు పఠించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి

అలాగే ఉగాది నాడు ఇంతకుముందు చూడని పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం మంచిది. ఆలయాల్లో వసంతనవరాత్ర ఉత్సవములు నిర్వహించడం, లేదా మీ శక్తి చేయించగలిగే పూజ చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. ఇంకా ఆలయాల్లో పంచాంగ శ్రవణం వినండి. అలాగే ఆలయాల్లో వసంతనవరాత్ర ఉత్సవాలు జరిపించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.