పంచాంగ శ్రవణంతో నవగ్రహ దోషాలు ఇట్టే తొలగిపోతాయట…

0
45

వేదాల ప్రకారం.. చైత్ర, వైశాఖ మాసాలను మధు, మాధవ మాసాలుగా పరిగణిస్తారు. చిత్తా నక్షత్రంతో సంబంధమున్నది చైత్రమాసం. శ్రీరామ పట్టాభిషేకానికి వసంత సమయమే సముచితమని భావించి వశిష్టాది మహర్షులు శ్రీ రామావతారానికి ప్రేరణగా నిలిచారు. ద్వాపర యుగం ముగిసిన తరువాత విధాత కలియుగాన్ని ఉగాది రోజునే ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి.

మహాభారత కాలంనుంచీ ఉగాది పర్వాన్ని నిర్వహిచుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాంటి మహిమాన్వితమైన ఉగాది రోజున పంచాగ శ్రవణం వినడం ద్వారా.. గ్రహ దోషములు తొలగిపోతాయి. ఉగాది రోజున పంచాంగం విన్నవారికి దోషాలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయి.

తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణాల ఫలితాలను తెలుసుకోవడం ద్వారా మానవునికి గంగా స్నానం చేసినంత సమానమైన పుణ్య ఫలం లబిస్తుంది. శాస్త్రవిదిగా పంచాంగం విన్నవారికి, చదివినవారికి సూర్యునివలన శౌర్యం, తేజస్సు, చంద్రుని వలన భాగ్యం, వైభవం, కుజుని వలన సర్వ మంగాళాలు, బుధుని వలన బుద్ధి వికాసం, గురుని వలన జ్ఞానం, శుక్రుని వల్ల సుఖం, శనివల్ల దుఃఖ రాహిత్యం, రాహువుచేత ప్రాబల్యం, కేతువు వలన తనవర్గంలో ప్రాబల్యం కలుగుతుందని విశ్వాసం. అందుచేత ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం మరిచిపోకండి..