మహిళా ఓటర్ల కోమసే పసుపు – కుంకుమ : జీవితా రాజశేఖర్

0
52
Jeevitha Rajasekhar
Jeevitha Rajasekhar

గత నాలుగున్నరేళ్ళ కాలంలో టీడీపీ ప్రభుత్వం మహిళలను ఎంతగా అవమానపరచాలో అంతగా అవమానపరిచారనీ, ఇపుడు టీడీపీ ప్రభుత్వం, ‘పసుపు-కుంకుమ’ పేరుతో డబ్బులివ్వడం విడ్డూరమని సినీ నటి జీవితా రాజశేఖర్ విమర్శలు చేశారు. ఇటీవలే వైకాపా తీర్థం పుచ్చుకున్న ఆమె… ఈ పథకం పేరుతో మహిళలను మభ్యపెట్టి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు కుట్రపన్నిందన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు.. హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణలపై సినీ నటి జీవితా రాజశేఖర్ విమర్శలు చేశారు. వీరిద్దరితో పాటు వారివారి కుటుంబ సభ్యులు దోపిడీదారులుగా మారిపోయారని ఆరోపించారు.

రాష్ట్రాన్ని చంద్రబాబు, ఆయన కొడుకు, నందమూరి బాలకృష్ణ దోచుకుంటున్నారని, ఇప్పుడు, కొత్తగా బాలకృష్ణ చిన్నల్లుడు కూడా తోడయ్యాడని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్లందరూ కలిసి మూకుమ్మడిగా కొట్టేసిస్తున్న డబ్బు ఎంత? అని ప్రశ్నించారు

అలాగే, టీడీపీ నేతలపై ఉన్న ఆరోపణలతో పోలిస్తే జగన్‌పై ఉన్నవి ఎంత? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు మాట్లాడితే జగన్‌పై అన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నాయని విమర్శిస్తున్నారని, కాల్ మనీ కేసులో, మహిళా అధికారిణులపై దాడి చేసిన కేసులో టీడీపీ నేతలు లేరా? అని ప్రశ్నించారు.