లోక్‌సభ బరిలో భార్యా బాధితుల సంఘం అధ్యక్షుడు

0
51

గుజరాత్‌లో భార్యా బాధితుల కోసం స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న దశరథ్ దేవ్‌డా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. ఈయన అహ్మదాబాద్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తనకు ఓట్లేసి గెలిపిస్తే.. భార్య చేతిలో వేధింపులకు గురవుతున్న భర్తల తరపున పార్లమెంట్‌లో గళం వినిపిస్తానని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

అఖిల భారతీయ పత్నీ అత్యాచార్ విరోధి సంఘ్ పేరిట ఆయన ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 69 వేల మంది సభ్యులుగా ఉన్నారు. గృహ హింస చట్టాన్ని ఆసరాగా చేసుకుని పలువురు భార్యలు భర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని, ఈ చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

కాగా, గత లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసిన దశరథ్ కేవలం 2,300 ఓట్లు మాత్రమే సాధించారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు 400 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినప్పటికీ ఆయన ఇపుడు జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా పోటీ చేయనున్నారు.