చనువుగా మాట్లాడుతూ పక్కలోకి రమ్మన్నాడు.. : శృతి మరాఠే

0
62
Shruti Marathe
Shruti Marathe

సౌత్ సినీ ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్‌ కౌచ్‌ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ మరాఠీ నటి శ్రుతి మరాఠే తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను తాజాగా వెల్లడించింది. ఆమె ఈ విషయాన్ని ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ద్వారా తెలిపారు.

’16 ఏళ్ల వయస్సు నుంచి సినీ పరిశ్రమలో చాలా అవమానాలు ఎదుర్కోన్నాను. సెలబ్రెటిలు జీవితాలు చాలా ఆనందంగా సాగుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నా కెరీర్ మెుదట్లో దక్షిణాది సినిమాల్లో నటించాను. ఓ సినిమా కోసం దర్శకుడు బికిని వేసుకోవాలన్నాడు. అతనికి ఎదురుచెప్పకుండా ఒప్పకున్నాను. తర్వాత మరాఠి షోలా ద్వారా నాకు బాగా పాపులారిటీ వచ్చింది. అనంతరం మరాఠీ ఇండస్ట్రిలో కొనసాగాను’ అని చెప్పింది.

ముఖ్యంగా, ‘కొన్ని మాటలు మన ఆత్మవిశ్యాసాన్ని దెబ్బతిసేలా ఉంటాయి. అలాంటి మాటలను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుపోయాను. అయితే సినిమాలో నన్ను నటించమని ఓ నిర్మాత నన్ను కలిశారు. మెుదట్లో గౌరవంగా మాట్లాడిన తాను తర్వాత అతని మాటలు గాడి తప్పాయి. నాతో సన్నిహితంగా ఉంటావా అని తన నిజాస్వరూపాన్ని బయటపెట్టాడు. దానికి నేను ధీటుగానే జవాబిచ్చినట్టు చెప్పారు.

తనను అడిగినట్టుగానే హీరోను కూడా ఇలాగే అడిగావా? అని నిలదీశాను. దీంతో అతను షాకయ్యాడు. అతడి నేను అలా ప్రశ్నంచినప్పుడు ప్రతి ఆడపిల్ల జీవితాన్ని దృష్టిలో ఉంచుకున్నాను. నేను వేసుకునే దుస్తులు నా వ్యక్తిత్వాన్ని తెలియజేయవు. నేను సాధించిన విజయాలే నా ప్రతిభ ఎంటో చెబుతాయి’ అని పేర్కొన్నారు.