సాయితో డేటింగా? గోంగూరనా?.. రెజీనా

0
44
Regina Cassandra
Regina Cassandra

టాలీవుడ్ యువ హీరోయిన్లలో రెజీనా ఒకరు. ఈమె మెగా కాంపౌండ్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకుంది. ఈమె నటిస్తున్న చిత్రాలు ఫెయిల్ అవుతున్నా ఛాన్సులు మాత్రం కొట్టేస్తోంది. అయితే, ఈమె తాజాగా ఓ యువ హీరోతో ప్రేమలో ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా, తన కోస్టార్‌తో డేటింగ్‌లో ఉందని వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై ఆమె స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టి పారేసింది. నేను నా కోస్టార్ తో డేటింగ్‌లో ఉన్నట్లు కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. డేటింగ్‌పై వస్తున్న పుకార్లు నిరాధారమైనవి. ప్రస్తుతం నా జీవితంలో నేను ప్రేమిస్తుంది నా పనిని మాత్రమే. ఒకవేళ ఎవరితో ప్రేమ వ్యవహారం లాంటిదేమైనా ఉంటే అది నా నుంచే వింటారు. నన్ను ఎల్లపుడూ ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. మీ ప్రోత్సహంతో నా పని సులభంగా కొనసాగుతుందని అంటూ పేర్కొంది. ప్రస్తుతం పలు తమిళ సినిమాలతో బిజీగా ఉంది.