ఒరేయ్ జగన్ దమ్ముంటే డిబేట్‌కు రా..రా..? సవాల్ విసిరిన పాల్

0
63

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒరేయ్ అంటూ పలికారు. వైకాపా కార్యకర్తలు శనివారం అర్థరాత్రి తనపై దాడి చేశారని కేఏ పాల్ ఆరోపించారు. భీమవరంలో తన హోటల్ గదిలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు.

ఈ విషయాన్ని చెప్పి, తనకు ప్రాణహాని వుందని.. తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇవ్వాలని కోరితే, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఓ గన్ మెన్‌ను ఇచ్చి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు.

అంతేగాకుండా ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై పాల్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘ఓరేయ్ జగన్.. దమ్ముంటే రారా.. నాతో డిబేట్‌కు. చేతకాని పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నావ్. నేడు జడుస్తాను అనుకుంటున్నావా? నేను ప్రపంచాన్ని జడిపించి ఇక్కడకు వచ్చాను. మా బీ-ఫారాలను దొంగలించడమే కాకుండా నా మీదే దాడి చేయిస్తావా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.