బాబాయ్ త్వరలో కోలుకోవాలి.. రామ్ చరణ్‌ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా?

0
76

బాబాయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌‌ను అబ్బాయి రామ్ చరణ్‌ పరామర్శించారు. పవన్ కల్యాణ్‌కు రెండు రోజుల క్రితం వడదెబ్బ తగిలిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా విజయవాడలోని పవన్ నివాసానికి రామ్ చరణ్ ఆదివారం చేరుకున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఓ ట్వీట్‌లో వెల్లడించారు. డీహైడ్రేషన్‌కు గురైన తన బాబాయ్ చాలా బలహీనంగా ఉన్నారని తెలిపారు.

ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఎన్నికల ప్రచారంలో పాల్గొనొద్దని బాబాయ్‌కు వైద్యులు సూచించారని, అయితే, పొలిటికల్ కమిట్‌మెంట్స్, ఎన్నికల ప్రచారానికి ఇంకా తక్కువ సమయం ఉన్నందున ప్రచారంలో పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నట్లు చెర్రీ చెప్పుకొచ్చారు.

కాగా అనకాపల్లి, పెందుర్తిలలో జరిగిన బహిరంగ సభల్లో పవన్ పాల్గొన్నారు. వడదెబ్బను కూడా లెక్కచేయకుండా ప్రజల కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాసేవకు పాటుపడుతున్న పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని, విజయం వరించాలని ఆకాంక్షిద్దామని రామ్ చరణ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే పవన్‌తో చెర్రీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన సన్నిహిత వర్గాల సమాచారం.