”మహర్షి” అదుర్స్.. కేవలం 13 గంటల్లో కోటి వ్యూస్.. కొత్త రికార్డ్

0
62

”మహర్షి” నెట్టింట దుమ్ముదులిపేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా మే 9న రిలీజ్ కానుంది. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే కథానాయిక. కామెడీ హీరో అల్లరి నరేష్ ఈ చిత్రంలో మహేశ్ స్నేహితుడిగా నటిస్తుండడం ఆసక్తి కలిగించే అంశం.

ఈ నేపథ్యంలో మహర్షి టీజర్ యూట్యూబ్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. అభిమానులకు ఉగాది కానుకగా వచ్చిన ఈ టీజర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం మహర్షి టీజర్‌కు యూట్యూబ్‌లో ఒక 1.2 కోట్ల వ్యూస్ రావడం విశేషం.

అంతేకాదు, కోటి వ్యూస్ నుంచి 1.2 కోట్ల వ్యూస్‌కి చేరడానికి చాలా తక్కువ సమయం తీసుకున్న టీజర్‌గా మహర్షి రికార్డు నెలకొల్పింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కరోజు వ్యవధిలో ఎక్కువమంది చూసిన టీజర్ కూడా ఇదే. దాంతోపాటే, ట్విట్టర్‌లో ఎక్కువమంది రీట్వీట్ చేసిన, లైక్ చేసిన టీజర్‌గానూ మహర్షి మరో ఘనత అందుకుంది.

మహర్షి టీజర్‌కు తొలి 24 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ వచ్చినట్టు ప్రముఖ సినీ పీఆర్వో బీఏ రాజు ట్వీట్ చేశారు. కేవలం 13 గంటల్లో కోటి వ్యూస్ వచ్చినట్టు వివరించారు. ఇందుకు ఈ సినిమాలోని మహేష్ గెటప్, డైలాగ్‌లు, యాక్షనే కారణమని సినీ పండితులు చెప్తున్నారు.