సోమవారం అలా చేస్తే.. ఆ దోషం తొలగిపోతుందంటే నమ్మండి..

0
53

అవును.. సోమవారం.. శివ నామ స్మరణ చేస్తూ అరుణాచలానికి వెళ్లి కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే.. ‘అపమృత్యు దోషం’ తొలగిపోతుందని పురాణాలు చెప్తున్నాయి. పరమశివుడు పృథ్వీ లింగంగా, ఆకాశ లింగంగా, జల లింగంగా, అగ్నిలింగంగా, వాయులింగంగా కొలువై ఆయా మహిమాన్విత క్షేత్రాల్లో పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.

అలాంటి అరుణాచలానికి వెళ్లి సోమవారం ప్రదక్షణలు చేస్తే.. అనుకున్న కార్యాలు దిగ్విజయం అవుతాయి. ఈ కొండ సాక్షాత్తు శివ స్వరూపమని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఈ కొండ మధ్యభాగంలో స్వామివారు దక్షిణామూర్తిగా ధ్యానంలో ఉంటాడని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.

అందువలన ఇక్కడి కొండకి ప్రదక్షిణం చేస్తే .. స్వామివారికి ప్రదక్షిణ చేసినట్టే అవుతుందని అంటారు. అందువలన భక్తులంతా కూడా దాదాపు 14 కిలోమీటర్ల పరిథి గల ఇక్కడి కొండకు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేస్తుంటారు. అందుచేత వీలును బట్టి ఓ సోమవారం అరుణాలేశ్వరుడి కొండను ప్రదక్షణ చేసుకోవడం ఉత్తమం. అంతేకాకుండా కార్తీక మాసంలో వచ్చే సోమవారంలో అరుణగిరి ప్రదక్షణ సర్వశుభాలను ప్రసాదిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.