వైకాపా మహిళా నేత వైఎస్ షర్మిల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్‌పై షర్మిల విమర్శలు గుప్పించారు. ఇంకా సైటైర్లు విసిరారు. తన అన్నయ్య చిరంజీవిని పవన్ కల్యాణ్ ఆదర్శంగా తీసుకున్నారని చెప్పారు.
నాడు పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన విషయం గుర్తుచేశారు. జనసేన పార్టీని టీడీపీకి హోల్ సేల్ గా పవన్ ఎప్పుడో అమ్మేస్తారని సెటైర్లు విసిరారు.
ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ నడుస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఏపీలో అవినీతి పాలన పోయి రాజన్న రాజ్యం రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అలాగే పనిలో పనిగా బీజేపీతో వైసీపీకి పొత్తు ఉందంటూ వస్తున్న వ్యాఖ్యలను షర్మిళ ఖండించారు.
బీజేపీతో తమ పార్టీకి పొత్తే కనుక ఉంటే తనపై ఉన్న కేసులన్నింటినీ జగన్ మాఫీ చేయించుకునే వారు కాదా? అని ప్రశ్నించారు. బీజేపీతో వైసీపీ పొత్తు ఉందన్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు.
అదేవిధంగా, టీఆర్ఎస్‌తో వైసీపీకి పొత్తు గురించి ఆమె మాట్లాడుతూ, ఆ పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడింది చంద్రబాబు అని, నందమూరి హరికృష్ణ భౌతికకాయం పక్కనే ఉన్న సమయంలో టీఆర్ఎస్‌తో పొత్తు కోసం మాట్లాడింది చంద్రబాబు అని నిప్పులు చెరిగారు.