యుద్ధ మూర్ఛతో భారత్‌పై దాడి చేయాలన్న లక్ష్యంతో పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ చేసిన బాధ్యతారాహిత్యం ప్రకటనపై భారత్ స్పందించింది. ఖురేషీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూనే, యుద్ధానికి సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
పాక్‌పై భారత్ కొత్త దాడికి పథకం రచిస్తోందని, తమకు అందిన సమచారం మేరకు ఏప్రిల్ 16-20వ తేదీ మధ్యలో ఆ దాడి జరిగే అవకాశముందని, నమ్మకమైన ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఈ మేరకు తమ ప్రభుత్వానికి సమాచారమందిందని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే
ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. భారత్‌లో ఉగ్రదాడులకు సిద్దమవ్వాలని పాక్‌కు చెందిన ఉగ్రవాదులకు పిలుపునిస్తున్నట్లు ఈ పబ్లిక్ జిమ్మిక్కు సృష్టంగా తెలియజేస్తుందని భారత్ తెలిపింది. పాకిస్థాన్ టెర్రరిస్టు దాడుల గురించి తీసుకునే చర్యలు, క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ షేర్ చేసేందుకు ఏర్పాటు చేసిన దౌత్య మరియు డీజీఎంవో చానెళ్లను ఉపయోగించాలని పాక్‌కు సూచించినట్లు తెలిపింది. సరిహద్దులు దాటి తీవ్రవాదులపై దాడి చేసే హక్కు భారత్‌కు ఉందని తెలిపింది.