మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావించి నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మొట్టమొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే అనుష్క, నయనతార వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఇటీవల శృతిహాసన్ పేరు కూడా వినిపించింది.
కానీ తాజాగా కీర్తి సురేష్ పేరు కూడా బయటకు వచ్చింది. ‘మహానటి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో పెద్ద హిట్ సినిమాల్లో నటించలేదు. అయితే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందన్న ప్రచారం ఫిల్మ్ నగర్‌లో జోరుగా సాగుతోంది. దీనిపై కూడా ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చనున్నారు.