థాయ్‌లాండ్ ఫుకెట్‌లోని మాయ్ ఖావ్ బీచ్ ఎన్నో ఏళ్లుగా టూరిస్టులను ఆకర్షిస్తోంది. కారణం ఇది ఫుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పక్కనే ఉంటుంది. చాలామంది విమానం వస్తున్నప్పుడు ఫొటోలు తీసుకుంటున్నారు. అయితే ఇలా ఫోటోలు దిగడం ఇకపై కుదరదు. ఇకపై ఇలా ఫొటోలు తీసుకుంటే… థాయ్ పోలీసులు జైల్లో పెడతారు.
ఇంకా ఎయిర్‌పోర్ట్ చుట్టూ 9 కిలోమీటర్ల ఎక్స్‌క్లూజన్ జోన్ ప్రకటించారు. ఇకపై ఎవరైనా ఆ జోన్‌లో డ్రోన్స్ ఎగరేసినా, లేజర్ లైట్లు వేసినా, ఫొటోలు తీసుకున్నా జైలుకు పంపుతారు. కొన్ని కేసుల్లో ఉరి శిక్ష కూడా వేస్తారు. అక్కడి ఎయిర్ నేవిగేషన్ చట్టం అంత కఠినంగా ఉంది.
విమానాలు ల్యాండ్ అయ్యే సమయంలో డ్రోన్లు అడ్డు వచ్చినా, షైనింగ్ లైట్లు వేసినా, లేజర్లు వేసినా… అవి కాక్‌పిట్‌లోని పైలట్లను కన్‌ఫ్యూజ్ చేస్తాయి. ఫలితంగా విమానంలోని ప్రయాణికులందరికీ ప్రమాదమేనని అధికారులు చెప్తున్నారు.
బీచ్‌పై నుంచీ విమానం వెళ్తుండగా… టూరిస్టులు ఫొటోలు తీసుకుంటే… అది పైలట్ల ఏకాగ్రతను దెబ్బతీస్తుందని, చాలామంది ఫొటోలు తీసుకునేటప్పుడు… పిచ్చి పిచ్చి ఫోజులు ఇస్తుంటే పైలట్ల దృష్టి వారిపై పడుతుందని.. ఫలితంగా అది ప్రయాణీకులకు మేలు చేయదని వారు చెప్తున్నారు