పేరు మార్చుకున్న మెగా హీరో.. “చిత్రలహరి” హిట్ కొట్టేనా..

0
70

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “చిత్రలహరి”. ఈ టైటిల్ ప్రకటించిన రోజు నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటించారు. సునీల్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు.

ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్లీన్‌ యు సర్టిఫికేట్ దక్కింది. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్‌ కొట్టాలన్న కసితో సాయి ధరమ్ తేజ్ ఉన్నాడు. ఇందుకోసం తన పేరును కూడా సాయి తేజ్‌ మార్చుకున్నాడు. మరి ఈ సినిమాతో అయిన సాయి తేజ్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. ఈయన కెరీర్‌ ఆరంభంలో మంచి హిట్స్ ఖాతాలో వేసుకోగా, ఆ తర్వాత వరుస పరాజయాలను చవిచూస్తున్నాడు.