బోసిపోయిన తిరుమల.. తగ్గిన హుండీ ఆదాయం.. సీన్ మారుతుందన్న టీటీడీ

0
45

కలియుగ వైకుంఠం తిరుమల వెంకన్న ఆలయంలో 24 గంటలూ భక్తుల రద్దీ వుంటుంది. అలాంటి ఆలయంలో భక్తుల రద్దీ అమాంతం తగ్గిపోయింది. ఏపీలో ఇటు అసెంబ్లీకి, అటు లోక్ సభకు గురువారం ఒకేసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భక్తుల రాక మందగించింది. స్వామివారి సాధారణ దర్శనానికి 4 గంటల సమయం, టోకెన్ స్లాట్ పొందిన భక్తుల దర్శనానికి, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతోంది. మంగళవారం కూడా భక్తుల రద్దీ కొండపై కనిపించలేదు.

నిత్యమూ 80 వేల మందికి పైగా స్వామిని దర్శించుకుంటుండగా, మంగళవారం నాడు 64,103 మంది స్వామిని దర్శించుకున్నారు. ఇంకా ఈ ప్రభావం హుండీపైనా పడింది. రూ. 2.65 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.

రోజూ వచ్చే సగటు ఆదాయంతో పోలిస్తే, ఇది చాలా తక్కువనేనని టీటీడీ అధికారులు వెల్లడించారు. అయితే ఎన్నికలకు తర్వాత, వారాంతంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం వుందని.. పరీక్షలు ముగియడంతో పాటు సెలవులు రావడంతో ఇక కొండపై భక్తుల రద్దీ రెండింతలు పెరిగే అవకాశం వుందని టీటీడీ అధికారులు చెప్తున్నారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించారు.