టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘భరత్ అనే నేను’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ సినిమా విడుదలకు ముందే హిట్ కొట్టేశారు. ఈ సినిమా బిజినెస్ టాలీవుడ్‌లో రికార్డును సృష్టిస్తూ, రూ. 140 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.
వచ్చేనెల 9న విడుదల కానున్న సినిమాకు డిజిటల్ శాటిలైట్ హక్కుల రూపంలోనే రూ.47.50 కోట్లు వచ్చాయని ట్రేడ్ వర్గాల అంచనా. ఇదే సమయంలో తెలుగు శాటిలైట్ హక్కుల రూపంలో రూ. 14.5 కోట్లు, హిందీ డబ్బింగ్, శాటిలైట్ హక్కులకు రూ. 20 కోట్లు, ఆడియో హక్కులకు రూ. 2 కోట్లు, ఓవర్ సీస్‌లో సుమారు రూ. 12.5 కోట్లు సంపాదించినట్టు తెలుస్తోంది.
ఇక ఆంధ్రా, సీడెడ్, నైజాం ఏరియాల హక్కులను కూడా కలిపితే ఈ మొత్తం రూ. 140 కోట్లకు పైనేనని సమాచారం. టాలీవుడ్ ప్రిన్స్ కెరీర్ లో ఇది ఆల్ టైమ్ రికార్డు అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇకపోతే.. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా, పూజా హెగ్డేతో పాటు అల్లరి నరేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు యూట్యూబ్‌లో భారీ వ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే.