జగన్‌కు కింగ్ నాగార్జున సపోర్ట్.. జై తెలుగుదేశం అంటోన్న సమంత

0
48

అవును… వైకాపా చీఫ్ జగన్‌కు పరోక్షంగా కింగ్ నాగార్జున సపోర్ట్ చేస్తే… ఆయన కోడలు మాత్రం జై తెలుగు దేశం అంటూ వీడియోను కూడా విడుదల చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో… అక్కినేని కోడలు సమంత ‘సైకిల్ గుర్తుకే మీ ఓటు’ అంటూ సోషల్ మీడియాలో చేసిన ప్రచారం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా ‘నేను మీ సమంత.. మన రేపల్లె మన అన్నగారు.. అభివృద్ధికి ఓటేయండి.. అనగాని సత్య ప్రసాద్‌ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. సైకిల్ గుర్తుకే మీ ఓటు’ అంటూ సమంత రేపల్లె టీడీపీ అభ్యర్ధి సత్యప్రసాద్‌ని గెలిపించమని కోరుతూ విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

అయితే సమంత ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లోని రేపల్లె అభ్యర్ధికి ఓటు వేయాలని కోరడం ఏంటి? ఆయనతో సమంతకు ఉన్న రిలేషన్ ఏంటి? అంటూ కూపీ లాగడం మొదలుపెట్టారు నెటిజన్లు. మరి ఈ వ్యవహారంపై మామా కోడలు మధ్య ఎలాంటి చర్చకు తావిస్తుందో వేచి చూడాలి