ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు, జగన్

0
52
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణితో కలిసి చంద్రబాబు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం ఒక్కొక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
భవిష్యత్ మారాలంటే తప్పనిసరిగా ఓటేయాల్సిందేనన్నారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. అందరూ ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఇవి చాలా కీలకమైన ఎన్నికలని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు దేశానికి దశ, దిశను నిర్దేశించాలని అన్నారు.
అలాగే వైకాపా అధినేత వైఎస్ జగన్, పులివెందులలోని భాకరాంపురం ఎంపీపీఎస్ స్కూల్‌లో ఓటేశారు. జగన్‌తో పాటు ఆయన భార్య భారతి కూడా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగన్ వెళ్లే సమయానికే పోలింగ్ బూత్ వద్ద పలువురు ఓటర్లు ఉండటంతో, కాసేపు జగన్ దంపతులు క్యూలో నిల్చున్నారు. సాధారణ క్యూలైన్లోనే వెళ్లి ఓటు హక్కును జగన్ వినియోగించుకున్నారు.