రూ.కోట్లు కొల్లగొడుతున్న మజిలీ

0
64

ఈ చిత్రం ఇటీవలి కాలంలో వచ్చిన చిత్రాల్లో ది బెస్ట్ అని టాక్ తెచ్చుకున్న చిత్రం మజిలీ. ఫలితంగా ఇటు యూత్‌ను.. అటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తోంది.

అక్కినేని ఇంటి జంట నాగ చైతన్య, సమంతలు కలిసి నటించారు. నిజ జీవితంలో భార్యాభర్తలైన ఈ జంట.. రీల్ లైఫ్‌లో తొలిసారి కలిసి నటించారు.

శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, భారీ వసూళ్లను రాబట్టింది.

నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్ ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమా 5 రోజుల్లో రూ.21.65 కోట్ల షేర్‌ను రాబట్టింది. చాలా కాలం తర్వాత చైతూకి దక్కిన విజయం ఇది. పెళ్లి తర్వాత చైతూ.. సమంత కలిసి చేసిన మొదటి సినిమా కావడమనేది ప్రత్యేక ఆకర్షణ అయింది.

కథాకథనాల్లో బలం.. వైవిధ్యం, దివ్యాన్ష కౌశిక్ గ్లామర్.. సక్సెస్‌లో ప్రధాన పాత్రను పోషించాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హడావిడి తర్వాత ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.