ఓటేసిన రాజకీయ ప్రముఖులు.. సెలెబ్రెటీలు.. భద్రత కట్టుదిట్టం

0
48
రాజకీయ ప్రముఖులతో పాటు సెలెబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును చింతమడకలో వినియోగించుకోనున్నారు. రెండోసారి సీఎం అయిన తర్వాత సొంతూరురికి కేసీఆర్ రావడం ఇదే తొలిసారి.
అదే విధంగా టీఆర్ఎస్ రాస్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన ఓటు హక్కును జీహెచ్ఎంసీ పరిధిలో వేయనున్నారు.బంజారాహిల్స్ నందినగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాలులో తన ఓటు హక్కు వినియోగించుకుంటారు. అలాగే  గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు ఉదయం 9 గంటలకు సోమాజీగూడ ఎంఎస్‌ మక్తాలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తారు.
మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కొద్దిసేపటి క్రితం ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కున్న చిరంజీవి, తన భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసనలతో కలిసి వచ్చి ఓటేశారు. తమ వంతు కోసం సుమారు 20 నిమిషాల పాటు వేచి చూసిన చిరంజీవి ఫ్యామిలీ, ఆపై పోలింగ్ బూత్లోనికి వెళ్లి ఓటేసి వచ్చారు.
అలాగే హీరో అల్లు అర్జున్‌, సినీ నటుడు పోసాని కృష్ణమురళి క్యూలెనులో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేస్తేనే మనకు ప్రశ్నించే అధికారం ఉంటుందని అల్లు అర్జున్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ కరీంనగర్‌లో ఓటు వేశారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మరపల్లిలో ఈవీఎం మొరాయించింది. అంతకుముందు జూబ్బీహిల్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని పలు పోలింగ్ కేంద్రాల్లో సినీ ప్రముఖులు వచ్చి ఓటేస్తుండటంతో ఆయా బూత్ లలో సందడి నెలకొంది. ఈ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.