ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభతో పాటు.. లోక్‌సభకు గురువారం పోలింగ్ జరుగనుంది. ఇందుకోస టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ ప్రచారం ముగియడంతో ఆయన కాస్త సేదదీరారు.
దాదాపు 110 బహిరంగ సభలు, రోడ్ షోలతో ఊపిరి సలపని విధంగా ప్రచార పర్వంలో పాల్గొన్న ఆయన విరామ సమయంలో తన నివాసంలో మనవడితో కలిసి ఆటపాటల్లో మునిగితేలారు. ఈ ప్రచారం ముగియడంతో చంద్రబాబు తన కుటుంబానికి కాస్త సమయం కేటాయించారు.
తన కుమమారుడు నారా లోకేశ్ – కోడలు బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్‌తో ఉత్సాహంగా పరుగులు తీస్తూ చిన్నపిల్లాడిలా మారిపోయారు. ఇంటి ఆవరణలోని గార్డెన్లో చంద్రబాబు తన మనవడితో కలిసి సరదా ఆటల్లో మునిగిపోయాడు.
ఈ సరదా సన్నివేశాన్ని ఫోటో తీసిన మంత్రి లోకేష్.. తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘తాతామనవళ్ల సరదా సమయం’ అంటూ క్యాప్షన్ పెట్టి ఫొటోని పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు తెలుగునాట వైరల్‌గా మారింది.
ఉప్పెనలాంటి విజయం కోసం అలుపెరగకుండా శ్రమించారని, దొరికిన కొద్దిపాటి సమయంలో తన కుటుంబంతో ఉల్లాసంగా గడిపారని వివరించారు. తాతమనవడి ఆనందమయ క్షణాలు చూడండి అంటూ పేర్కొన్నారు.