షాకిచ్చిన ప్రైవేట్ బస్సులు.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

0
59

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా హైదరాబాదులోని ఓటర్లంతా తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో బస్సులన్నీ కొద్ది రోజుల క్రితమే ప్రయాణికులు బుక్ చేసుకున్నారు. అయితే బుధవారం ఉన్నట్టుండి అనేక ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీలు తమ బస్సులను రద్దు చేయడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.

ఇక ఇటు రైళ్లలో కూడా నిలబడేందుకు సైతం చోటు దొరక్కపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచి ఏపీకి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను వేసినట్టు ప్రకటించింది. బుధవారం సాయంత్రం 6:20కి సికింద్రాబాద్ నుంచి కాకినాడకు, రాత్రి 7:20కి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును వేసినట్టు రైల్వేశాఖ తెలిపింది. అలాగే, రాత్రి 9 గంటలకు లింగంపల్లి నుంచి కాకినాడకు కూడా ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్ళను గురువారం కూడా నడుపనుంది.

ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ పక్రియ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

గురువారం ఉదయం 7.30-8.00 గంటల సమయంలో విజయవాడలోని పటమటలో ఉన్న చైతన్య ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ స్కూల్‌లో ఉన్న పోలింగ్ బూత్‌లో పవన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.