బోయపాటి బాంబులు బాగానే పేలాయి.. టీడీపీకి ఆ యాడ్స్ బాగా కలిసొస్తాయా?

0
46

 

వినయ విధేయ రామ ఫట్‌తో డీలా పడిపోయిన బోయపాటి శీనుకు టీడీపీ ఎన్నికల యాడ్స్ ద్వారా పని పెట్టింది. ఎమోషనల్, అగ్రెసివ్, యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్లు రూపొందించడంలో బోయపాటి మేటి. అలాంటి బోయపాటి చేతిలో టీడీపీ యాడ్స్ పడ్డాయి. అందుకే ఇప్పుడు అదిరిపోయేలా యాడ్స్ తీశాడు. ఈ యాడ్స్ చూసినవారంతా బోయపాటికి మెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో బోయపాటికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఎన్నికల ప్రచారం వేళ బాబు తన టీడీపీ ప్రచార యాడ్‌లను పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్న బోయపాటి చేతిలో పెట్టారు. ఆయన టీడీపీ పథకాలపై చేసిన యాడ్స్ ప్రస్తుతం టీవీల్లో చక్కర్లు కొట్టాయి. తటస్థ ఓటర్లు కూడా బాబు చేసిన ఈ పనులకు ఓటేయాలన్నంతగా కట్టిపడేసేలా బోయపాటి మార్క్ ప్రకటనలు రూపొందాయి. ఏ పార్టీ కూడా అంత ఎమోషనల్‌గా ప్రకటనలు రూపొందించలేదంటే అతిశయోక్తి కాదు.

ఇంకా సినిమాల్లోనే కాదు.. ప్రచార ప్రకటనల్లోనూ బోయపాటి బాంబులు బాగానే పేలుతున్నాయని సినీ జనం అనుకుంటున్నారు. ఇకపోతే.. యాడ్స్ నిమిత్తం బోయపాటి ఎంత తీసుకుని వుంటాడనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో బోయపాటి రూ.5 కోట్ల మొత్తం చేతికి అందుకున్నాడు. కానీ ఈ యాడ్స్ తయారికీ బోయపాటికి పట్టిన సమయం నెలన్నరేనని తెలిసింది.