ధోనీ అండ్ కింగ్స్ కొత్త రికార్డు.. మిస్టర్ కూల్‌కు కోపం వస్తే..??

0
69
dhoni
doni

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన సత్తా చాటాడు. జట్టును సమర్థవంతంగా నడిపించే ధోనీ తాజాగా ఐపీఎల్‌లో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించింది. గురువారం రాజస్థాన్ రాజస్థాన్ రాయల్స్‌తో చివరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నైతోపాటు ఆ జట్టు కెప్టెన్ ధోనీ ఖాతాలోనూ అరుదైన రికార్డు వచ్చి చేరింది.

రాజస్థాన్‌పై విజయం సాధించిన చెన్నై వంద మ్యాచుల్లో విజయం సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. మొత్తం 166 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సరిగ్గా వంద విజయాలు నమోదు చేసింది. అంతేకాదు, ఐపీఎల్‌లో వంద మ్యాచులు గెలిచిన జట్టుకు సారథ్యం వహించిన తొలి కెప్టెన్‌గా ధోనీ పేరు రికార్డుల్లోకి ఎక్కాడు.

మిస్టర్ కూల్‌కు కోపం వస్తే..
మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకుని, ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ధోనీకి కోపం వచ్చింది. తన సహజ స్వభావానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించాడు. అవుట్ అయి మైదానం బయటకు వెళ్లిన తరువాత, తిరిగి మైదానంలోకి వచ్చి గొడవ పడ్డాడు. దీన్ని ఐపీఎల్ నిబంధనల ప్రకారం 2వ స్థాయి నేరంగా పరిగణిస్తూ, మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాను విధించారు నిర్వాహకులు.

అంతకుముందు చివరి ఓవర్ ను స్టోక్స్ వేస్తూ, శాంటనర్ కు ఫుల్ టాస్ బాల్ వేశాడు. ఈ బాల్ గాల్లోకి లేచి, ఆరు పరుగులు తెచ్చింది. ఇదే బాల్‌ను తొలుత నోబాల్ గా ప్రకటించిన ఎంపైర్లు, దాన్ని వెనక్కు తీసుకోవడమే ధోనీ ఆగ్రహానికి కారణమైంది. ఫీల్డ్ అంపైర్ ఉల్లాస్ ఘాండే దీన్ని నోబల్ అని పేర్కొనగా, స్క్వేర్ లెగ్ అంపైర్ బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్ దాన్ని నోబాల్ కాదని తేల్చారు. దీంతో అప్పటికే పెవీలియన్ చేరిన ధోనీ, తిరిగి మైదానంలోకి వచ్చి గొడవకు దిగాడు. దీంతో ధోనీకి జరిమానా తప్పలేదు.