ఏపీ ఎన్నికల్లో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాజువాక నుంచి పోటీ చేశారు. పవన్ బరిలోకి దిగడంతో, ఇక్కడ ముక్కోణపు పోటీ జరిగింది. పవన్ గెలుపు ఖాయమేనని తొలుత నుంచి ప్రచారం జరిగింది కూడా. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు, వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి పోటీ పడగా, విజయంపై ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
తెలుగుదేశం పార్టీ అందించిన సంక్షేమ పథకాల ద్వారా లబ్దిని పొందినవారు భారీ ఎత్తున ఓటు వేసేందుకు వచ్చారని, అందువల్ల తన విజయం ఖాయమని టీడీపీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరావు అన్నారు
తనకు సౌమ్యుడన్న పేరుందని, కష్టపడి పనిచేసిన తనకే ప్రజలు ఓట్లు వేశారని, పవన్ ఓటమి ఖాయమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. వాస్తవానికి పవన్‌కు గాజువాకలో మొదటి నుంచి వ్యతిరేక పవనాలే వీచాయని చెప్పొచ్చు. పవన్ ఏర్పాటు చేసుకున్న బహిరంగ సభ రద్దయింది. ఆయనకు వడదెబ్బ తగలడంతో చివరిలో విస్తృతంగా ప్రచారం చేయలేకపోయారు.