కేంద్రంలో నరేంద్ర మోదీ.. ఏపీలో జగన్మోహన్ రెడ్డికే మళ్లీ పట్టం?

0
40

2014 ఎన్నికల్లో బీజేపీ సష్టించిన ప్రభంజనం 2019 ఎన్నికల్లో పునరావృతం కానుందట. లోక్‌సభలోని 543 సీట్లకుగాను హీన పక్షంలో బీజేపీకి 323 సీట్లు, గరిష్టంగా 380 సీట్లు వస్తాయని అమెరికాలోని గూఢచారి సంస్థ సీఐఏ, పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐ నిర్వహించిన ప్రీ పోల్‌ సర్వేలో తేలినట్లు ఓ మీడియా సంస్థ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అన్ని సీట్లు బీజేపీకి వస్తాయని, ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయో కూడా వైరల్‌ అయిన వార్తలో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో 25 సీట్లకుగాను మూడు నుంచి నాలుగు, అరుణాచల్‌ ప్రదేశ్‌లో రెండు సీట్లకు రెండు, అస్సాంలో 14 సీట్లకుగాను 8-10 సీట్లు, బీహార్‌లో 40 సీట్లకుగాను 30-35 సీట్లు, చత్తీస్‌గఢ్‌లో 11 సీట్లకుగాను ఆరు నుంచి ఎనిమిది, గోవాలో రెండుకు రెండు, గుజరాత్‌లో 26కు 24–25, తెలంగాణలో 17లో ఒకటి నుంచి రెండు, తమిళనాడులో 39కి 28-30, త్రిపురలో రెండుకు రెండు సీట్లు వస్తాయని ఆ వార్తలో వెల్లడి అయ్యింది.

ఇకపోతే.. సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) సంస్థ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో ఈ సంస్థ చేసిన సర్వేలో ఫలితాలు జగన్‌కు అనుకూలంగా వచ్చాయని, ఖచ్చితంగా జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని సీపీఎస్ ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలరావు తెలిపారు.

ఈ సర్వే ప్రకారం జగన్ నేతృత్వంలోని వైసీపీకి ఆధిక్యత లభిస్తుంది. వైసీపీకి 48.1 శాతం ఓట్లు, టీడీపీకి 40.1 శాతం, జనసేన పార్టీకి కేవలం 8 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. వైసీపీ 121 నుంచి 130 స్థానాల్లో విజయం సాధిస్తుంది. టీడీపీ 45 నుంచి 54 స్థానాల్లో, జనసేన ఒకట్రెండు గెలుస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ 47 శాతం ఓట్లు రాబట్టుకోనుందని తాజా సర్వేలో వెల్లడి అయ్యింది.