కప్ కాఫీ తాగుదామా.. అంటూ కాఫీ డే ట్రీట్‌కి ఓ అమ్మాయి పిలిస్తే ఎవరైనా వెళ్లకుండా ఉంటారా? అలాంటి ఓ హీరోయిన్ పిలిస్తే.. ఎవరు వెళ్లకుండా ఉంటారు చెప్పండి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ కేతిక శర్మ లెమెన్ టీ తాగుదామా అంటూ కంటికి కనిపించిన వారందర్నీ పిలుస్తోందట.
ప్రస్తుతం ఈ అమ్మడు ఆకాశ్ పూరి హీరోగా పూరి జన్నాధ్ దర్శత్వంలో తెరెకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆన్ లొకేషన్ ఫోటోలను సీనియర్ హీరోయిన్ ఛార్మి ఇటీవలే సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. వాటికి అభిమానుల నుంచి చక్కని స్పందన వచ్చింది. ఇకపోతే రొమాంటిక్ సెట్స్‌లో కేతిక ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో రివీల్ చేసింది.
ఈ భామ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోల్ని రివీల్ చేస్తోంది. ఆన్ లొకేషన్ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన రకరకాల ఫోటోల్ని రివీల్ చేస్తోంది. తాజాగా బికినీ బీచ్ లో ఓ కుర్చీ వేసుకుని కేతిక ఒంటరిగా లెమన్ టీ తాగుతూ కనిపించింది. అంతేకాదు కప్ లెమన్ టీ కలిసి తాగుదామా? అంటూ కుర్రకారును కవ్విస్తూ సామాజిక మాధ్యమాల్లో పిలుపునిచ్చింది.