మనలో చాలా మంది బరువు తగ్గాలనుకునే వారు మొదట చేసే పని ఆహారం తక్కువగా తీసుకోవడం. అలా చేయటం వల్ల కొన్ని పోషకాలు సరిగ్గా అందకపోయినా బరువు తొందరగా తగ్గలేం. ఎముకలు దృఢంగా ఉంచడంలో, కండరాలను బలంగా చేయడంలో క్యాల్షియం పాత్ర కీలకం. మన శరీరానికి కావాల్సిన మోతాదులో క్యాల్షియం లేనప్పుడు ఒకరకమైన హార్మోన్ విడుదలయ్యేలా చేస్తుంది. అది మన శరీరంలో కొవ్వు నిల్వకు కారణం అవుతుంది.
మనం తీసుకునే పండ్లూ, కూరగాయల్లో సమృద్ధిగా లభించే విటమిన్ సి కూడా కొవ్వును కరిగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. బరువు తగ్గించడంలో వీటిపాత్ర దాదాపు 30 శాతం కన్నా ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లూ, ఇతర పోషకాలూ ఆహారాన్ని ఆలస్యంగా జీర్ణమయ్యేలా చేస్తాయి.
వ్యాయామం చేసినప్పుడు తొందరగా అలిసిపోకుండా శక్తినీ అందిస్తాయి నిమ్మజాతిపండ్లు. రక్తపోటును అదుపులో ఉంచడంలో మెగ్నీషియం పాత్ర కీలకమే. కొవ్వును కరిగించడంలో, బరువును అదుపులో ఉంచడంలోను కూడా అంతే కీలకం అంటున్నారు మన నిపుణులు. ఈ పోషకాలు బాదం, అరటిపండూ, డార్క్‌చాక్‌లేట్‌లోను పుష్కలంగా మనకు లభిస్తుంది.