చక్కని ఆరోగ్యం కోసం వీటిని ఆరగించండి…

0
43

ప్రతి రోజూ క్రమం తప్పకుండా కూరగాయలు తినడం వలన బరువు తగ్గుతారు. ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు మరెన్నో లాభాలు పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

* ఉదయం తీసుకునే అల్పాహారంలో కూరగాయలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. పాలకూరతో చేసిన ఆమ్లెట్‌, పరోటా ఇలా ఏ ఆహారమైన తీసుకోండి. అందులో ఎక్కువగా కూరగాయ ముక్కలు ఉండేలా చూసుకోవాలి.

* మనం తీసుకునే ఆహార పదార్థాల్లో డెబ్భై శాతం మొక్కల నుంచి వచ్చే పదార్థాలను తీసుకోవాలని మన నిపుణులు చెబుతున్నారు. అందులోనూ కూరగాయలు, పండ్లూ, గింజలు, చిరుధాన్యాలూ, చిక్కుళ్లూ, బీన్స్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

* మన భోజన పళ్లెంలో మూడు వంతుల కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పలు రకాల రంగుల్లో ఉండే కూరగాయలన్నింటినీ రుచి చూడాలి. కూరగాయల్లో ఉండే భిన్నమైన పోషకాలు కూడా మనకు అందుతాయి.

* కూరగాయలను ముక్కలుగా కోసుకుని తినడానికి సమయం లేనివారు రసం రూపంలో తాగొచ్చు. అలా చేయడం వలన ఎక్కువ పరిమాణంలో తీసుకునే అవకాశం ఉంటుంది.