దుస్తులు కొనుక్కునేందుకు డబ్బులు లేవు : జాన్వీ కపూర్

0
66

తొలి చిత్రం “ధఢక్”తో ఎంతోమంది అభిమానులను సంపాదించింది జాన్వీకపూర్. కాస్ట్యూమ్స్ ఏవైనా జాన్వీ తన అందంతో అందరిని మెస్మరైజ్ చేస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో నేటి యూత్‌కి ఐకాన్‌గా నిలుస్తోంది. జాన్వీ కపూర్ ప్రత్యేక కార్యక్రమాల్లో తప్పించి.. ఎప్పుడైనా తనికిష్టమైన సాదాసీదా దుస్తుల్లో కనిపిస్తుంటుంది. అయితే ఎపుడు ఒకే రకమైన దుస్తుల్లో కనిపిస్తుందంటూ తనపై వచ్చిన ట్రోల్స్‌పై అనైటా ష్రాప్ చాట్ షోలో స్పందించింది జాన్వీ.

“నేను ప్రతీరోజు కొత్త డ్రెస్ కొనేందుకు.. ఎక్కువ డబ్బులు ఏం సంపాదించడం లేదు. ట్రోల్స్‌ నాపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. ఒకవేళ నా పని గురించి విమర్శలు వస్తే.. వాటిని సీరియస్‌గా తీసుకుంటా. కానీ జిమ్ బయట నేను ఎలా కనిపించినా.. అది నా ఉద్యోగం కాదు కదా” అని జాన్వీ కౌంటరిచ్చింది.