బీజేపీ మరింత బలంగా ఉంది : నరేంద్ర మోడీ

0
73

దేశంలో బీజేపీ గాలి బలంగా వీస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ తన ఉనికిని కాపాడుకోవడం కూడా కష్టమేనన్నారు. ఉధంపూర్‌ బీజేపీ అభ్యర్థి జితేంద్ర సింగ్‌ తరపున కఠువా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను దేశం మొత్తం తిరిగా. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా మరింత బలంగా బీజేపీ అనుకూల పవనాలను చూశా’ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ తన ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకే కేంద్ర ప్రభుత్వ చర్యలపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆరోపించారు.

దేశానికి జాతీయవాదమే ఆత్మ అన్నారు. జలియన్‌వాలా బాగ్‌ ఘటనకు 100 ఏళ్లు నిండిన సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్‌ రాజకీయం చేసిందన్నారు. ఆ కార్యక్రమానికి పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ గైర్హాజరవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.