15-04-2019 (సోమవారం) రాశిఫలాలు

0
50

మేషం : రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు సదవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన వెంచర్ల పట్ల ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు ఒక ప్రకటన కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. స్త్రీలకు ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడటంతోపాటు రుణ విముక్తులు అవుతారు. వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.

వృషభం : వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు లాభదాయకం. స్త్రీలకు వస్త్రములు, అలంకరణలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. వాణిజ్య ఒప్పందాలు, స్థిరచరాస్తుల లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న ఒత్తిళ్లు, చికాకులు క్రమంగా తొలగిపోతాయి.

మిథునం : అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి. లీజు, ఏజెన్సీ, స్థిరాస్తుల కొనుగోళ్ల విషయంలో తొందరపాటుతనం కూడదు. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. ఏజెంట్లు, మార్కెటింగ్ రంగాల వారి టార్గెట్లు పూర్తి కాగలవు. సేవ, సాంఘిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. దేవాలయాలను దర్శిస్తారు.

కర్కాటకం : చేపట్టిన పనులలో ఓర్పు, పట్టుదల అవసరం. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరగలదు. స్త్రీలు భేషజాలకు, మొహమాటాలకు పోవటం మంచిది కాదు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. విద్యార్థులకు ధ్యేయంపట్ల ఏకాగ్రత చాలా అవసరం.

సింహం : కుటుంబ సమస్యలు తీరి, ఆర్థిక పరిస్థితిలో ఆశాజనకమైన మార్పులు సంభవిస్తాయి. పాత మిత్రుల కలయికతో మీలో మార్పు వస్తుంది. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మీ యత్నాలకు సన్నిహితులు అన్నివిధాలా సహకరిస్తారు. తలపెట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి.

కన్య : ఆర్థిక లావాదేవీలు, కీలకమైన వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. స్త్రీలకు చుట్టుప్రక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలసిరాగలదు. ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులవల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. కుటుంబ సౌఖ్యం, ఆత్మీయులతో వినోదాలు వంటి శుభ పరిణామాలుంటాయి.

తుల : ఆస్తి వ్యవహారాల్లో ముఖ్యుల ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. భాగస్వామిక చర్చల్లో కొత్త కొత్త విషయాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులకు తోటివారితో సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగ యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం కలిగిస్తుంది.

వృశ్చికం : స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ఉద్యోగయత్నాలు ఆశాజనకంగా సాగుతాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. దూరపు బంధువుల నుంచి బహుమతులను అందుకుంటారు. చేతి వృత్తి వ్యాపారులకు అన్నివిధాలా అనుకూలం.

ధనస్సు : ఉద్యోగస్తులకు అధికారులతో సమన్వయం లోపిస్తుంది. స్త్రీల ఆలోచనలు పొదుపు దిశగా కొనసాగుతాయి. దైవదీక్షలు, సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల తీరును గమనించి మెలగాల్సి ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. నూతన పెట్టుబడులు, టెండర్లు అనుకూలిస్తాయి.

మకరం : విద్యార్థులు నిరంతర కృషివల్ల అభివృద్ధి పొందుతారు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. వృత్తుల వారికి, ఏజెంట్లు, బ్రోకర్ల శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు అనుకూలిస్తాయి.

కుంభం : గృహంలో ఒక శుభకార్యానికి అనువైన వాతావరణం నెలకొంటుంది. రాబడికి మించిన ఖర్చులు, చెల్లింపులవల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. ప్రింటింగ్, బైండింగ్ పనివారలకు మందకొడిగా ఉంటుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తుల కార్యదీక్ష, పట్టుదలకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.

మీనం : దైవదీక్షలు, సామాజిక సేవలపట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తుల వారికి అన్నివిధాలా కలసిరాగలదు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు ఆశాజనకం. బ్యాంకింగ్ వ్యవహారాల ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. వైద్యులు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం.