బాలీవుడ్ కుర్ర హీరోయిన్ జాహ్నవి కపూర్. అతిలోక సుందరి దివంగత శ్రీదేవి ముద్దుల కుమార్తె. ఈమె నటించిన తొలి చిత్రంతోనే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీంతో ఈమె ఏ పని చేసినా అది హాట్‌టాపిక్‌గా మారింది. జాన్వి ఎయిర్ పోర్ట్‌లో కనిపిస్తే ఫోటోలు.. హోటల్‌కు వెళ్తే ఫోటోలు.. ఇంటినుంచి బయటకు వస్తే ఫోటోలు.. జిమ్‌కు వెళ్తే ఫోటోలు.. ఆఖరుకు కారు ఎక్కినా ఫోటోలే.. దిగినా ఫోటోలే.
గతంలో జాన్వి కొన్ని సందర్భాలలో క్యాజువల్‌గా కనిపించేది. కానీ ఇప్పుడు ఈ కెమెరాల అటెన్షన్ కారణంగా తన డ్రెస్ విషయంలో డబల్ జాగ్రత్తలు తీసుకుంటోంది. జిమ్‌కు కసరత్తుల కోసం వెళ్ళే సమయంలో కూడా కత్తిలాంటి దుస్తులు వేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. తన డ్రెసింగ్‌లో మార్పు కూడా ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
పైన ఉన్న ఫోటో జిమ్‌కు వెళ్తూ.. ఎక్సర్ సైజులు చేసి అలిసిపోయి బయటకు వస్తూ ఉన్నప్పుడు తీసినవే. కానీ డ్రెస్సులు చూస్తే కెవ్వుకేక అనిపించేలా ఉన్నాయి.