రాత్రిపూట ఉపవాసం ఆరోగ్యానికి మంచిదా?

0
42

చాలా మంది ఉదయం వేళల్లో ఉపవాసం ఉంటుంటారు. ముఖ్యంగా, మహిళలు అయితే, ఉదయం వేళల్లో అల్పాహారం తీసుకోరు. అమితమైన దైవభక్తి ఉండేవారు అయితే ప్రతి రోజూ ఉపవాసం ఉంటుంటారు. అయితే, ఉదయం పూట ఉపవాసం ఉండటం మంచిదా.. రాత్రిపూట ఉపవాసం ఉండటం మంచిదా అనే విషయాన్ని వైద్యులను అడిగి తెలుసుకుందాం.

రాత్రి పూట డిన్నర్ చేయకుండా నిద్రకు ఉపక్రమిస్తే, మధ్య రాత్రిలో ఆకలేస్తుంది. ఒకసారి మేలుకొంటే, మళ్లీ నిద్రపట్టదు. నిజానికి రాత్రి పూట చేసే ఉపవాసంతో మంచి నిద్ర వస్తుందని, ఏకాగ్రత, చురుకుదనం పెరుగుతాయని తాజా అధ్యయనంలో తేలింది. నిద్రపోతున్నప్పుడు పెద్ద వారిలో దాదాపు 500 కేలరీలు ఖర్చవుతాయని ఈ పరిశోధనలో తేలింది.

రాత్రివేళలో కొంత కాలం కడుపునిండా ఆహారం, పానీయాలు ఇచ్చామని, ఆపై మరికొన్ని రోజులు ఎటువంటి ఆహారం ఇవ్వకుండా నీరు మాత్రమే ఇచ్చి, వీరు ఎలా నిద్రపోతున్నారన్న విషయాన్ని పరిశీలించి అధ్యయనాన్ని రూపొందించామని అధ్యయనకారులు చెప్పారు.

కడుపునిండా తిన్నప్పటితో పోలిస్తే, ఆహారం తీసుకోనప్పుడే బాగా నిద్ర పట్టినట్టు తేలిందన్నారు. రాత్రి సమయాల్లో మితాహారమే మేలని, ఎక్కువగా తినడం వల్ల నిద్రలేమితో పాటు ఇతరత్రా సమస్యలు కూడా ఏర్పడతాయని వారు అంటున్నారు.