వెన్నునొప్పి నుంచి విముక్తి పొందాలంటే…

0
46

* లక్షలాదిమందిని బాధిస్తున్న సమస్య నడుంనొప్పి. కదలకుండా కూర్చోవడం, కూర్చునే భంగిమ సరిగా లేకపోవడం వయసు ప్రభావం, ఊబకాయం నడునొప్పికి చాలా కారణాలు. మన ప్రపంచ జనాభాలో 80 శాతం మంది తమ జీవితంలో ఒక్కసారైనా నడుంనొప్పి బారిన పడకుండా ఉండరని తేలింది.

* పురుషులతో పోల్చుకుంటే 40-80 మధ్యవయసు మహిళల్లో ఈ సమస్య ఎక్కువనీ, దీర్ఘకాలికంగా నడునొప్పితో బాధపడేవాళ్లు త్వరగా మరణించే అవకాశం ఉందనీ మన పరిశోధకులు పేర్కొంటున్నారు. నడక తగ్గిపోతుంది, ఫలితంగా జీర్ణవ్యనస్ధ దెబ్బతింటుంది, మానసికంగానూ కుంగిపోతారు.

* బాధను భరిస్తూ కూర్చొ‌వడం కన్నా తొలిదశలోనే తగ్గించుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు చెబుతున్నారు. మన జీవనశైలిలో ఆహారపు అలవాట్లు, వ్యాయమం చేయడం వంటి జాగ్రత్తలు పాటించాలని మన నిపుణులు వివరిస్తున్నారు.