10 కేజీల బరువు తగ్గిన రకుల్ ప్రీత్

0
64
Rakul Preet Singh
Rakul Preet Singh

ఇప్పుడు ట్రెండ్ అంటే కేవలం హీరోలు సిక్స్ ప్యాక్ ట్రై చేయడం కాదు. కథ డిమాండ్ చేస్తే హీరొయిన్ అయినా ఒళ్ళు వంచుతున్నారు. కథకు తగ్గట్టు బాడీని మార్చుకుంటున్నారు. ఆ మధ్య సైజ్ జీరో కోసం అనుష్క బాగా బరువు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడింది కూడా. అయినా కథ డిమాండ్ చేస్తే హీరోయిన్లు ఏమాత్రం వెనుంకజ వేయడం లేదు. ఎంతకైనా తెగిస్తున్నారు.

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇదే పని చేసింది. వచ్చే నెల 17న విడుదల కాబోతున్న “దే దే ప్యార్ దే” చిత్రంపై ఈ అమ్మడు బోలెడు ఆశలు పెట్టుకుంది. 50 ఏళ్ళ వయసున్న హీరో పాత్రతో ప్రేమలో పడే పడుచు అమ్మాయిగా ఇందులో చాలా డిఫరెంట్ రోల్ చేస్తోంది. ప్రమోషన్‌లో సైతం అలుపు లేకుండా పాల్గొంటోంది. దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది రకుల్

తొలుత ఈ పాత్ర ఆఫర్ చేసినప్పుడు దర్శకుడు ఆకివ్ అలీ నిర్మాత లవ్ రంజన్ బరువు తగ్గమని చెప్పారు. అచ్చంగా “కాక్‌టైల్‌” చిత్రంలో దీపికా పదుకునే తరహాలో బాగా సన్నబడాలని సూచించారు. దాంతో స్వంతంగా జిమ్ ఉన్న తను నో చెప్పడం భావ్యం కదాని భావించి వెంటనే ఓకే చెప్పిందట. నెల రోజుల పాటు కఠిన శిక్షణ తీసుకుని తాను కోరుకున్న ఆకారంలో శరీరాకృతిని మలుచుకుందట. ఇందుకోసం ఆహార అలవాట్లు మార్చుకోవడం కష్టం అనిపించినా ఏమాత్రం వెనుకంజ వేయలేదట.

మొత్తానికి దాని తాలుకు ఫలితాన్ని శాంపిల్ రూపంలో ట్రైలర్‌లో రకుల్ మందు కొట్టి డాన్స్ చేసిన వీడియో సాంగ్‌లోనూ చూడొచ్చు. ఈ చిత్రంలోని పాత్ర రిస్కుతో కూడుకున్నదే అయినప్పటికీ ఛాలెంజ్‌గా తీసుకున్నానని చెబుతున్న రకుల్ ఒకవేళ సౌత్‌లో ఇంతకుముందులా డిమాండ్ పీక్స్‌లో ఉండి ఉంటే ఒప్పుకునేదా అనే ప్రశ్నకు సమాధానం తనకు మాత్రమే తెలుసు.